‘నారా పవన్‌ రాహుల్‌ నాయుడు’ గా కొత్త అవ‌తారం

3 Jan, 2019 13:05 IST

 

న్యూఢిల్లీ: అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన ఏపీ సీఎం చంద్రబాబు ‘నారా పవన్‌ రాహుల్‌ నాయుడు’గా కొత్త అవతారం ఎత్తారని వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో ఓ మారు పొత్తు పెట్టుకుని విడాకులు తీసు కున్న చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ ఆయనతో బంధానికి తహతహలాడుతున్నారని అన్నారు. ఇలా ఆయన మనసులో విషయం స్పష్టమవుతోందన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని విడాకులు తీసుకున్న బాబు ఇప్పుడు ఎన్టీఆర్‌ ఆశయాలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారన్నారు.